జమ్మికుంట, జనవరి1: మానవాళికి హానికరమ య్యే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సే ంద్రియ వ్యవసాయం చేయాలని గ్రామీణ నవనిర్మాణ సమితి అధ్యక్షుడు, కేయూ మాజీ ఉపకులపతి డాక్టర్ వీ గోపాల్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. సోమవారం జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జీఎన్ఎన్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డి జయంతి వేడుకలను కేవీకేలో ఘ నంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేంద్రియ/ప్రకృతి సాగుపై రైతులు, రైతు ఉత్పత్తిదారుల సభ్యులు, అగ్రి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు ఎరువుల వాడకాన్ని పెంచారని పేర్కొన్నారు. మోతాదుకు మించి వాడుతున్న క్రిమి సంహారక మందుల వల్ల నేల తన స్వభావాన్ని కోల్పోవడమే కాకుండా ఆహార ధాన్యాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తె లిపారు.
సేంద్రియ/ప్రకృతి సాగే మేలని సూచించారు. రైతులు సుస్థిర సాగు దిశగా అడుగులు వేయాలని కేయూ ప్రొఫెసర్ డాక్టర్ రామిరెడ్డి పేర్కొన్నారు. నేల, ఆరో గ్యం కాపాడడం అందరి బాధ్యతని జీఎన్ఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి విజయ్గోపాల్రెడ్డి అన్నారు. రైతు ఆర్థికాభివృద్ధి సాధిస్తేనే దేశం ముందుకు సాగుతుందని గ్రామ బజార్ కార్యదర్శి దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జీఎన్ఎన్ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.