Peddapally | పెద్దపల్లి రూరల్ ఆగస్టు 17 : పెద్దపల్లి మండలంలోని భోజన్నపేటకు చెందిన హనుమాన్ స్వాముల నుంచి యాదగిరి లక్ష్మీనృసింహస్వామి నుంచి తీసుకొచ్చిన స్వామి ప్రసాదాన్ని టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమిల్ల రాకేష్ స్వీకరించారు. ఈ మేరకు గత కొద్ది రోజులుగా హనుమాన్ మాల ధరించిన స్వాములు యాదాద్రి పర్యటనకు వెళ్లి అక్కడి నుంచి తీసుకొచ్చిన యాదగిరి లక్ష్మినృసింహ స్వామి ప్రసాదాన్ని రాకేష్ కు పెద్దపల్లిలోని ఆయన స్వగృహంలో ఆదివారం కలిసి అందజేశారు.
ప్రసాదం అందించిన వారిలో భోజన్నపేటకు చెందిన ఆంజనేయ స్వామి మాలధరించిన స్వాములు మేకల సంతోష్, జడల శ్రీనివాస్, బైరీ సురేష్ , బిట్టి అశోక్, మేరుగు ఓదెలు, మేడగొని తిరుపతి, ఆవుల సంతోష్ తదితరులు ఉన్నారు.