Koppula Eshwar | ధర్మారం,అక్టోబర్5: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త ఆకారి అనిల్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. అనిల్ అనారోగ్యంతో కరీంనగర్ లోని దవాఖానలో చేరి చికిత్స పొందుతున్నాడు. దీంతో సమాచారం తెలియడంతో దవాఖానికి వెళ్లి ఈశ్వర్ అతడిని పరామర్శించారు.
వైద్యులతో మాట్లాడి అనిల్ కు మెరుగైన చికిత్స అందించాలని వారికి సూచించారు . అనిల్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈశ్వర్ వెంట నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, బొట్ల వనపర్తి గ్రామ పార్టీ నాయకులు రెడపాక శ్రీనివాస్, ఆకారి సత్యం, ఆకారి అంజయ్య తదితరులు ఉన్నారు.