కరీంనగర్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని కో రారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన లు చేపట్టారు. పలుచోట్ల మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, బిల్లులు చెల్లించకుంటే గ్రామపంచాయతీలకు తాళం వేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో తాము తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితిలో లేమని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తీర్చలేక వేధింపులకు గురవుతున్నామని తెలిపారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు.