వెల్గటూర్, మార్చి 17: పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలంటూ మాజీ సర్పంచులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో వెల్గటూరు (Velgatur) మండల మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టుచేశారు. సోమవారం తెల్లవారుజామునే సర్పంచుల ఇండ్లకు చేరుకున్న పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రూ.1000 కోట్లను విడుదల చేయకపోవడం కక్ష సాధింపు చర్య అని, అక్రమంగా అరెస్టు చేస్తున్నారని తాజా మాజీ సర్పంచులు వాపోయారు. అరెస్టయిన వారిలో రాజక్కపల్లి, స్తంభంపల్లి, శాకాపూర్ మాజీ సర్పంచులు బోడకుంటి రమేశ్, రాం చందర్, బాలసని రవి ఉన్నారు.