Vempally | మల్లాపూర్, జూన్ 23 : మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని, మాజీ సర్పంచ్ బిట్ల సరోజన తన వంతుగా పాఠశాలకు బాధ్యతగా ప్రత్యేక చేయూతను అందించారు. తాను చదివిన పాఠశాలల్లో ప్రస్తుతం చదువుతున్న 115 మంది విద్యార్థులకు రూ.23 వేల విలువ గల పుస్తకాలు, తదితర సామగ్రిని మంగళవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ ఏటా తన వంతు బాధ్యతగా పాఠశాలకు తగిన సేవలను అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగ్లావత్ రాజేందర్, విద్యకమిటీ చైర్మన్ మానస, మాజీ సర్పంచ్ జలపతిరెడ్డి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.