బీఆర్ఎస్ తాజా మాజీ మున్సిపల్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయంగా సన్మానించారు. ఇటీవల కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ కాలం ముగియగా, శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆత్మీయ సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో కలిసి మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు, వైస్ చైర్పర్సన్లను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో మీ కృషితో పట్టణాలు, నగరాలు ఎంతో అభివృద్ధి చెందాయని కొనియాడారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండాలని, అప్పుడే ప్రజలు మళ్లీ గెలిపించుకుంటారని నిర్దేశం చేశారు.