పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, వరంగల్ ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్
చిగురుమామిడి, ఫిబ్రవరి 4: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, వరంగల్ ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్‌లో ఆదివారం బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వొడితల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మామిడి అంజ య్య, సోమారపు రాజయ్య, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు జంగ వెంకటరమణారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ కర్వేద మహేందర్ రెడ్డి, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, నాయకులు రామోజు కృష్ణమాచారి, పెనుకుల తిరుపతి, రాజేశ్వర్ రెడ్డి, కత్తుల రమేశ్, మిట్టపల్లి మల్లేశం, సన్నీల్ల వెంకటేశం, కల్వల సంపత్ రెడ్డి, నాగెల్లి రాజిరెడ్డి, శ్యామకూర సంపత్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

