Sunke Ravishankar | బోయినపల్లి రూరల్, ఫిబ్రవరి 2 : బోయినపల్లి మండలం అనంతపల్లి మాజీ ఎంపీటీసీ వంగపల్లి రాజిరెడ్డి తండ్రి వంగపల్లి కేశవరెడ్డి అనారోగ్యంతో శనివారం రేకుర్తిలో మృతి చెందాడు. కాగా ఆయన అంత్యక్రియలు సోమవారం స్వగ్రామం అనంతపల్లిలో నిర్వహించారు. విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి హాజరై కేశవరెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య,మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, మాజీ జెడ్పీటీసీ కొంకటి లచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, నాయకులు చిందం రమేష్, పర్శ మల్లేశం, గడ్డం తిరుపతి రెడ్డి, డబ్బు వెంకట్ రెడ్డి, కమల్ గౌడ్, జంపుక ఆనంద్, చందు తదితరులు ఉన్నారు.