Ramlila Committee | తిమ్మాపూర్, సెప్టెంబర్24 : ఎల్ఎండీ రామ్ లీలా కమిటీ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలు అవాస్తవమని రామ్ లీలా కమిటీ చైర్మన్ కుంట రాజేందర్ రెడ్డి అన్నారు. ఆయన ఎల్ఎండీలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలని, మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.
రామ్ లీలా కమిటీకి, కాంగ్రెస్ పార్టీకి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాంలీలా వేడుకలను రాజకీయం చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారి రమేష్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోరపల్లి రమణారెడ్డి, మామిడి అనిల్ కుమార్, దావ సంపత్ రెడ్డి, పోలు రమేష్, మాచర్ల అంజయ్య, గంకిడి లక్ష్మారెడ్డి, అన్నాడి రఘు, ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.