Putta Madhukar | మంథని, మే 10: సీయోను చర్చి పాస్టర్ వల్లూరి ప్రభాకర్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. అయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారి స్వగ్రామం భువనగిరిలో జ్ఞాపకార్ద కూడికకు హాజరై నివాళులు అర్పించారు.
అయన సతీమణి దయామణి, కూతురు ప్రజ్వల సునయన, అల్లుడు అభిషేక్ ను ఓదార్చిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాస్టర్ ప్రభాకర్ అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కు రాకేష్, సంఘ పెద్దలు అంకరి కుమార్, ఎంకే జోసఫ్, ప్రేమకుమార్, ప్రసాద్, పాస్టర్లు మహేష్, రాజేష్ పాల్గొన్నారు.