Putta Madhukar | గీత కార్మికుడికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శ
రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు కెక్కర్ల సాయిబాబా ఇటీవల తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
Putta Madhukar | రామగిరి, జూన్ 18 : రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు కెక్కర్ల సాయిబాబా ఇటీవల తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గురువారం బేగంపేటలోని సాయిబాబా నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా గీత కార్మికుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శంకేసి రవీందర్, బుర్ర శంకర్ గౌడ్, కుమార్ యాదవ్, కాపురబోయిన భాస్కర్, దామెర శ్రీనివాస్, శంకర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

