Manohar Reddy | సుల్తానాబాద్ రూరల్ డిసెంబర్ 28: నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఆదివారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సన్మానించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామ సర్పంచ్ శోభ రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజయ్య, అయితే రాజ్ పల్లి గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్, ఉప సర్పంచ్ దాసరి మధుసూదన్ రెడ్డి ఆదివారం సాయంత్రం వేరువేరుగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి వారిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్, కేశవరెడ్డి, రవీందర్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.