Koppula Easwar | ధర్మారం ,మే 13: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత స్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు. భక్తుల ఇలవేల్పు శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తుల పాలిట కొంగుబంగారమై వెలుగొందుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6 న మొదలై మంగళవారం రథోత్సవం తో ముగిసాయి.
ఈ క్రమంలో రథోత్సవం సందర్భంగా మాజీ మంత్రి ఈశ్వర్ సతీమణి స్నేహలత స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథం వద్ద మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్నేహలత వెంట మాజీ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ఖిలావనపర్తి గ్రామ మాజీ ఎంపీటీసీ మోతే సుజాత కనకయ్య, గ్రామ మాజీ ఉపసర్పంచ్ కీసర స్వరూప రాణి, ధర్మారం మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాకాల రాజయ్య, ఆవుల శ్రీనివాస్, గుర్రం రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.