జగిత్యాలలో కేసీఆర్ సభ విజయవంతమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో రోడ్లపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై కేసీఆర్ స్పీచ్‌ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కేసీఆర్, జీవన్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో పార్టీ శ్రేణులంతా కేరింతలు కొట్టారు. ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు, జీవన్‌రెడ్డి అనుచరుల్లో ఉత్సాహం వెల్లివెరిసింది.

జగిత్యాల సభకు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
మెట్పల్లి/కోరుట్ల/ మేడిపల్లి/మల్యాల/ మల్లా పూర్/సారంగాపూర్/ ఇబ్ర హీంపట్నం/కోరుట్ల రూరల్/ కథలాపూర్/ మారుతీనగర్ ఏ ప్రిల్ 20: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన ప్రజా గర్జన, ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం ఉత్సాహంగా తరలివెళ్లాయి. గులాబీ కం డువాలు ధరించిన యువకులు, మహిళలు జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎ మ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల నియోజ కవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సభకు హాజర య్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. కోరుట్ల పట్టణం లోని 33 వార్డుల నుంచి 25 బస్సులు, కార్లు, ఆటోల్లో 2500 మంది బీఆర్ఎస్ నాయకులు, మహిళలు కేసీఆర్ సభకు తరలారు.
ఇక్కడ ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జీలు ఉన్నా రు. మల్లాపూర్ మండల వ్యాప్తంగా 23 గ్రామాల నుంచి 50 ప్రత్యేక బస్సులో 2500 మంది బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లినట్లు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్ తెలిపారు. చొప్పదండి నియెజకవర్గ ఇన్చార్జి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నేతృత్వంలో మ ల్యాల మండలం నుంచి 4 వేల మందితో జగిత్యాల సభకు తరలివెళ్లారు. నాయకులు జనగం శ్రీనివాస్, రామ్మోహన్రావు, సాగర్‌రావు, మధుసూదన్ రావు, తిరుపతిరెడ్డి, రవివర్మ ఉన్నారు. మేడిపల్లి, భీమారం మండలాల నుంచి బయలు దేరిన వారిలో సర్పంచ్ మకిలి దా స్, కార్యకర్తలు అంకం విజయసాగర్, ద్యావనపెల్లి అభిలాష్, లోలపు రాజరెడ్డి, లోక జలపతిరెడ్డి, గంగం ఆనందం, నలువాల వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
సారంగాపూర్ బీర్పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల నుంచి వాహనాల్లో భారీగా నాయకులు, కార్యకర్తలు, జనం తరలివెళ్లారు. సభకు తరలిన వారిలో సారంగాపూర్, బీర్పూర్ బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు తేలు రాజు, నేరెళ్ల సుమన్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు అనంతుల గంగారెడ్డి, మాజీ ఎంపీపీలు మసర్తి రమేశ్, గుడిసె శ్రీమతి జితేందర్ యాదవ్, మాజీ జడ్పీటీసీలు భూక్యా సరళ, ముక్క శంకర్, మాజీ వైస్‌ఎంపీపీలు కొండ్ర రాంచందర్‌రెడ్డి, బేతి పూర్ణచందర్ రెడ్డి, బల్మూరి లక్ష్మణ్ రావు, మాజీ విండో చైర్మన్లు సాగి సత్యంరావు, మెరుగు రాజేశం, ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ మానిటరింగ్ కమిటీ మా జీ సభ్యుడు ఎండబెట్ల ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల నుంచి సభకు సుమారు 20 బస్సుల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు దశరథ్‌రెడ్డి బస్సులకు జెండా ఊపి బయలుదేరారు.

కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ హైలెట్స్..
జగిత్యాల కలెక్టరేట్/రాయికల్/మల్యాల/జగిత్యాల అర్బన్/ కొడిమ్యాల/ధర్మపురి/పెగడపలి ్ల, ఏప్రిల్ 20 : సభ చుట్టూ ఏర్పాటు చేసిన ఎంట్రెన్స్‌ల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసిన పోలీసులు సభకు వచ్చేవారిని తనిఖీలు చేసి సభలోకి అనుమతించారు. సాయంత్రం ఐదు గంటల వరకే సభా ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది.
సభా ప్రాంగణంలో మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లు పుష్కలంగా అందుబాటులో ఉంచారు. వలంటీర్లు సభకు వచ్చిన ప్రజలకు ఎక్కడిక్కడ అందించడంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సభికులు దాహార్తిని తీర్చుకున్నారు.
సభకు వచ్చిన ప్రజలపై పార్టీ డ్రోన్స్ ద్వారా గులాబీ పూల వర్షాన్ని కురిపించడంతో సభికులు పులకరించిపోయారు.
కేసీఆర్ సభా వేదికకు చేరుకోగానే సభలో ఉన్న ప్రజలు తమ సీట్లలోంచి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ, మెడలో ఉన్న కండువాలు ఊపుతూ కేకలు వేస్తూ స్వాగతం పలికారు. జనం చప్పట్లు, ఈలలతో సభాప్రాంగణం మొత్తం మార్మోగింది. బస్సులోంచి సభావేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్ తన వంట జీవన్‌రెడ్డిని సభా వేదికపైకి తీసుకుని రాగా, వేదికపై ఉన్న నాయకులు చప్పట్లు కొడుతూ కేసీఆర్, జీవన్‌రెడ్డిని ఆహ్వానించారు.
సభా వేదికపైకి కేసీఆర్ చేరుకోగా పెద్ద బాపు వచ్చిండంటూ చప్పట్లు కొడుతూ ఈలలు వేశారు.
సభా వేదికపైకి కేసీఆర్ అభివాదం చేస్తుండగా సీఎం.. సీఎం.. అంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ వారిస్తున్నప్పటికీ వారు ఆపకుండా నినాదాలను కొనసాగించారు.
జీవన్‌రెడ్డికి కేసీఆర్ కండువా కప్పుతుండగా సభకు హాజరైన ప్రజలు అరుపులు, కేకలతో సభాప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. జీవన్‌రెడ్డి మొదలు జీవన్‌రెడ్డితో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతున్నంత సేపు సభికుల చప్పట్లు ఈలలు కొనసాగింది. మరోవైపు అభిమానులు పెద్ద ఎత్తున పటాకులు కాల్చుతూ సంబురాలు చేసుకున్నారు.
జీవన్‌రెడ్డి ప్రసంగిస్తున్నంత సేపు ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు.
సభలో కేసీఆర్‌తోపాటు ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌషిక్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లు ప్రస్తావించిన ప్రతి సందర్భంలో సభికులు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ హర్షాతీరేకాలు వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ సర్కారు రాగానే జీవన్‌రెడ్డి మంచి పదవిలో ఉంటాడు. కేసీఆర్ మాట.. ఇది నా మాట అనడంతో సభ మొత్తం చప్పట్లతో మార్మోగియింది.
ఇక్కడ మీరు జీవన్‌రెడ్డి కోసం పోరాడండి.. జీవన్‌రెడ్డిని కలుపుకొని రాష్ట్రంలో నేను యుద్ధం చేస్తాననడంతో సభికులు జై కేసీఆర్.. జై కేసీఆర్ అంటూ నినదించారు.
సభలో యువకులు లొల్లి చేస్తుండడంతో ఆపండయ్యా మీ లొల్లి.. ఇది లైవ్ ప్రోగ్రాం.. గిట్ల లొల్లి చేస్తే మీ ఫొటోలు, వీడియోలే బయటకు పోతాయని అనడంతో లొల్లి బంద్ చేయడమే కాకుండా సభికులు నవ్వుకున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతుబంధుకు రాంరాం.. దళిత బంధుకు జై భీం అని కేసీఆర్ అనడంతో సభ చప్పట్లతో మార్మోగింది.
ఈ కాంగ్రెసోళ్లు ఆరు వేల రైతుబంధు వేసి మా అంత సిపాయిలు లేరని బొచ్చలు గుంజుకుంటున్నరడంతో సభలో నవ్వులు విరిసాయి.
బీఆర్ఎస్ పాలనలో టంగ్టంగ్ మనుకుంటూ రైతుబంధు బ్యాంకులో పడగానే టింగ్టింగ్ అంటూ బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకున్నారని కేసీఆర్ అనడంతో జై కేసీఆర్.. జై కేసీఆర్ అంటూ నినదించారు. జగిత్యాలలో సభ పెడుతున్నమని కాంగ్రెస ప్రభుత్వం రైతుబంధు వేస్తామని ప్రకటించారని, మల్లోసారి రైతుబంధు రావాలంటే మళ్లీ కేసీఆర్ సభ పెట్టాలా అనే సరికి సభికులు ఈలలు, కేకలు వేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తాం.. హైబ్రాను ఎత్తివేస్తూ తొలి సంతకం చేస్తానని ప్రకటించడంతో సభికులు జై కేసీఆర్.. జై సీఎం అంటూ నినదించారు. హైద్రాబద్‌లో హైడ్రా, నిజామాబాద్‌లో నిడ్రా అంటున్న కాంగ్రెస్ నాయకులు ఇగ జగిత్యాలకు జిడ్రాను తెస్తారు కావొచ్చనడంతో సభలో నవ్వులు విరిసాయి.
యూరియా బస్తాలిచ్చుడు కూడా కాంగ్రెస్‌కు సాతనైతలేదు. రైతులు యూరియా అడిగితే ప్రభుత్వం యాప్ చూపిస్తుందని, దుకాణాల్లో కాకుండా యూరియా యాప్‌లో దొరుకుద్దా.. యాప్ కోసం రైతుల కాల్లకు వాపులచ్చేలా ఉన్నాయనడంతో సభికులు కేకలు వేశారు.
కాకికి పెడుదామంటే కంకెడు లేవు.. పిట్టకు పెడుదామంటే పిడికెడు ఇత్తులు లేవు.. అనేసరికి సభ ఒక్క సారిగా నవ్వుకుంది.
తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ ప్రారంభించుడేనా అని కేసీఆర్ ప్రశ్నించగా, షురూ చేసుడే… అంటూ సభికులు జోరుగా జవాబిచ్చారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్షకు కూసున్ననని కేసీఆర్ అనగా, సభికులు పెద్దఎత్తున కేకలు వేశారు.
ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లిచ్చినంకనే ఓట్లు అడుగుతా అని అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే ఇంటింటికి నీళ్లిచ్చిన.. మరీ ఈ సర్కారుకేం రోగం పుట్టింది.. నీల్లెందుకిస్తలేరు. నీళ్లివ్వని కాంగ్రెస్ నాయకుల లాగులు పగులగొట్టాలని అనగా జనం కేకలు వేస్తూ అవునంటూ అరిచారు.కేసీఆర్ ప్రసంగించే సమయంలో వేదికపై ఉన్నవారి పేర్లు చదువుతూ.. పట్టాన్ని పేర్లున్నయి… ఇవన్నీ సదువాలంటే తెల్లారేటట్టున్నదనే సరికి వేదికై ఉన్న వారితో పాటు సభ మొత్తం నవ్వులు వెల్లివిరిసాయి.
కెమెరామెన్లు ఫొటోలు తీస్తుండగా సభలో కొంత ఇబ్బందిగా మారడంతో బాబూ నీ లొల్లేందయా.. ప్రజలు లొల్లిపెట్టినా ఆపవా.. అని కేసీఆర్ అనడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. కేసీఆర్ ప్రసంగిస్తుండగా సభికులు సీఎం.. సీఎం.. అంటూ నినదించగా, స్పందించిన కేసీఆర్ గిట్ల మనలో మనమే అనుకుని ఇక పోదామా అనడంతో నవ్వులు విరిసాయి.
పొద్దుగాల్ల లేచినకాడి నుంచి మొదలు కేసీఆర్ సావు కోరుకునుడేనా.. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను సావ.. పిల్లి సాపనార్థాలకు ఉట్టి తెగిపడుతదా.. నీ సాపనార్థాలకు నేను సత్తనా.. అని అనడంతో సభలో ఉన్నవారు ఎగబడి నవ్వారు.
కేసీఆర్ ప్రసంగ సమయంలో యువకుల అదే పనిగా కేరింతలు, ఈలలు వేస్తుండడంతో ఏ కౌషిక్‌రెడ్డి.. ఆల్లను ఆగవట్టయా.. అని కేసీఆర్ నవ్వడంతో పాటు సభలో ఉన్నవారందరూ నవ్వుకున్నారు. సభాప్రాంగణంలో తెలంగాణ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటపాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గాయకులు పాడిన పాటలకు సభికులు వారితో పదం… కదం కలుపుతూ ఆడిపాడారు.
జగిత్యాల ఎమ్మెల్యే ఏ గుర్తుపై పోటీ చేశారు.. అంటూ కళాకారులు ప్రశ్నించగా కారు గుర్తుపై పోటీ చేశారని, గెలిచాక ఏ పార్టీలో చేరారనే ప్రశ్నకు కాంగ్రెస్.. కాంగ్రెస్‌లో అంటూ ముక్తకంఠంతో సభికులు జవాబిచ్చారు.
కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రేవంత్‌రెడ్డి రిబ్బన్లు కడుతూ ప్రారంభోత్సవాలు చేస్తున్నాడనగా.. అవునుఅవును అంటూ, ఇంకే కట్టిండనే ప్రశ్నకు ఉన్నవి కూలుస్తుండని సభికుల నుంచి పెద్దఎత్తున సమాధానాలు వచ్చాయి.
ఉత్త మాటలు చెప్పే రేవంత్‌రెడ్డి తెలంగాణకు నువ్వొక 420, అటోనివా…ఇటోనివా సంజయ్.. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లోకి ఎట్లపోతవ్, మోదీ కిలాడీ.. ఏందయా నీ గడబిడ అంటూ గాయకులు పాడిన పాటలకు జనం చప్పట్లు కొడుతూ కోరస్ పాడారు.
ఎన్నికలెప్పుడచ్చినా కారు గుర్తుకే ఓటెస్తాం.. కాంగ్రెస్‌ను ఖతం చేస్తాం అంటూ కళాకారుల పాటకు సభికులు చేతులూపుతూ చప్పట్లు కొట్టారు.