Gangadhara | గంగాధర, జనవరి 18 : గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు మల్కాపురం రాజేశం మాట్లాడుతూ నందు నందమూరి తారకరామారావు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని సృష్టించిందని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పూర్వవైభవం రానుందని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో టీడీపీ కమిటీలను కూడా వేసి, పార్టీని బలోపేతం చేయనున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. ప్రతీ టీడీపీ కార్యకర్త పార్టీ బలోపేతానికి ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు వైద భూపతి, జిల్లా నాయకుడు కమలాపురం శ్రీపతిరావు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు దొంతుల వేణుగోపాల్, మండల ప్రధాన కార్యదర్శి జారతి నర్సయ్య, కోశాధికారి కవ్వంపల్లి అంజయ్య, గ్రామ శాఖ బలబత్తిలి పర్శరాములు, నాయకులు బోయిని రవి, ముదిగంటి బాలు, వేణు తదితరులు పాల్గొన్నారు.