Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 18 : తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపునకు గాను మండలంలోని అన్ని గ్రామాలకు ఇన్చార్జీల నియామకం చేపడుతున్నట్లు జేఏసీ చైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు. చిగురుమామిడి మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొని కేసులు నమోదు కాబడిన వారితో పాటు జైల్లో ఉన్న, బైండోవర్ అయిన ఉద్యమకారులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమానికి ఊపిరి పోసిన వారందరినీ గ్రామాల వారీగా ఉద్యమకారులను గుర్తిస్తున్నట్లు తెలిపారు.
ఇందుకుగాను గ్రామానికి ఒక ఇన్చార్జిలను ఏర్పాటు చేసి ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించి ఈ నెల 22న తుది జాబితాను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కో కన్వీనర్ చీకోటి రమణయ్య, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, సభ్యులు రామోజు కృష్ణమాచారి, మామిడి అంజయ్య, సర్వర్ పాషా, పత్తేము రమేష్, గూడెం లక్ష్మి, మాధవరెడ్డి, పన్యాల నాగిరెడ్డి, పన్యాల భూపతిరెడ్డి, కూతురు శరభంద రెడ్డి, తాళ్ల పెళ్లి సంపత్, మావురపు రాజు, నీలిగొండ దశరథం తదితరులు పాల్గొన్నారు.