Godavarikhani | కోల్ సిటీ, జూన్ 2 : రైజింగ్ రామగుండంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మంగళ వారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక దశాబ్దాల పోరాటం, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, అమరవీరుల ఆత్మబలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం విశేష పురోగతి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల విస్తరణ, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, విద్యా ,వైద్య రంగాల బలోపేతం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడుతున్నాయని అన్నారు.
రామగుండం నగరం ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యాలకు అనుగుణంగా ఎంఎల్ఏ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో మంత్రి డీ శ్రీధర్ బాబు సంపూర్ణ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. పాలక వర్గం వచ్చిన వంద రోజుల కాలంలో రామగుండం నగరాన్ని ఒక అందంమైన పరిశుభ్ర నగరంగా, చెత్త రహిత ప్రాంతంగా తీర్చి దిద్దడానికి ప్రయత్నం ప్రారంభించనట్లు చెప్పారు. ఈ ప్రయత్నంలో కార్పొరేటర్ లతో పాటు నగర పాలక సంస్థ అధికారులు సిబ్బంది చిత్త శుద్ధితో పని చేస్తున్నారన్నారు.
అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు సంతోష్ రావు, దాసరి సాంబమూర్తి, సూర్య, వెంగళ బాపు, గట్ల రమేష్ , రేణికుoట్ల నిర్మల, చిదురాల నాగరాజు, నెలకంటి రాము, డేవిడ్ రాజు, వడ్లూరి రవి, నాయకులు కజంపురం రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.