Forest Land | రుద్రంగి, మార్చ్ 29 : రుద్రంగి మండలకేంద్రంలోని నల్లగుట్ట ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికివేసి భూమిని చదును చేస్తున్నారన్న సమాచారంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్, బిట్ ఆఫీసర్ బాలకృష్ణ చెట్లు నరికిన ప్రాంతానికి వెళ్లగా వారి రాకను గమనించిన వ్యక్తులు వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ ఆరు ద్విచక్రవాహనలను అక్కడే వదిలేసి వెళ్లడంతో వాటిని సీజ్ చేసి పోలీస్టేషన్‌కు తరలించమన్నారు. ఆ వాహనాలు ఎవరివి చెట్లను నరికిన వ్యక్తులు ఎవరన్నది దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇష్టానుసారంగా అటవీ చెట్లను నరికి వేయడం వల్ల భావితరాలకు భవిష్యత్‌కు ఆధారమైన అటవీ ప్రాంతం కనుమరుగు అవుతుందని అంతే కాకుండా అక్రమంగా అటవీ ప్రాంతంలో చెట్లను నరికిన భూమిని చదును చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని వాహనాలను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. అటవీ ప్రాంతాన్ని పరిరక్షించేందుకు ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ విక్రమ్, హోమ్ గార్డ్ నర్సయ్య, వాచర్లు ఉన్నారు.