Forest land | రుద్రంగి, సెప్టెంబర్ 20: ఫారెస్ట్ అధికారుల కనుషన్లోనే ఉమ్మడి మానాలలో వేల ఎకరాల అటవీ భూములు అన్యం ప్రాంతం అవుతున్నాయని మానాల గ్రామ ప్రజలు యువకులు ఆరోపించారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఫారెస్ట్ భూములను కాపాడాలని గ్రామస్తులు, యువకులు గ్రామపంచాయతీ ముందు శనివారం నిరసన వ్యక్తం చేసి ఫారెస్ట్ పోలీస్ అధికారులను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ రుద్రంగి మండలం మానాల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గతంలో ఫారెస్ట్ అధికారులు నీలగిరి చెట్లను నాటి పెంచుతుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వేల ఎకరాల్లో చెట్లను తొలగించి భూమి చదును చేసి బోర్లు బావులు వేయడం జరిగిందన్నారు. బీట్ ఆఫీసర్ మౌనిక ఫారెస్ట్ సిబ్బంది సహకారంతోనే కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి అడవులను ధ్వంసం చేశారని ఆరోపించారు.
అధికారులు డబ్బులు తీసుకుని అడవులు అన్యాక్రాంతం అవుతున్న పట్టించుకోవడం లేదన్నారు. రెండు సంవత్సరాలుగా అధికారులకు ఫారెస్ట్ భూములను కాపాడాలని విన్నవించిన పట్టించుకోవడంలేదని అన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇష్టాను రీతిగా డబ్బులు వసూలు చేసి దుండగులకు స్థానిక ఫారెస్ట్ అధికారులు సహకరిస్తున్నారన్నారు. ఎఫ్ఆర్ఓ కలిలుద్దీన్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన గత రెండు సంవత్సరాలుగా సమావేశాలు నిర్వహించి హామీలు ఇవ్వడమే తప్ప సమస్య పరిష్కరించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం అటవీ భూములను ధ్వంసం చేస్తున్న వ్యక్తుల దగ్గర నుండి పట్టుకున్న బైక్లను వదిలివేసి వారి దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని నిలదీశారు. స్థానిక సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని ఫారెస్ట్ భూమిలో చెట్లను తొలగించి చదును చేసిన ప్రాంతాన్ని పరిశీలించి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ బాలామణి తో మాట్లాడి అన్యాక్రాంతం అయిన అటవీ భూమి ప్రాంతంలో మొక్కలను నాటించి, కంచె ఏర్పాటు చేస్తామని అటవీ భూమిని కాపాడేందుకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు యువకులు నిరసన విరమింప చేశారు. ఇక్కడ ఎస్సై శ్రీనివాస్ మాజీ వైస్ ఎంపీపీ భూమయ్య పోలీస్, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.