Dairy industries | సుల్తానాబాద్ రూరల్ జూన్ 12: వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలపై రైతులు సాధించాలని జాతీయ మాంస పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ ఎస్బీ బార్ బుద్దే అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లో ని కాట్నపల్లి రైతు వేదికలో గురువారం వికాసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా, తెలంగాణ వ్యవసాయ, అనుబంధ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలో 15 రోజులపాటు వివిధ మండలాల్లోని గ్రామాలలో నిర్వహిస్తూ రైతులకి వ్యవసాయం లోని నూతన సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన కల్పిస్తున్నారు.
చివరి రోజైన గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బుద్దే మాట్లాడారు. రైతులు తమ ఆదాయం రెట్టింపు చేసుకోవడం కోసం గొర్రెలు, మేకల పెంపకం తో పాటు కోళ్ల పెంపకం మీద కూడా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక స్కీముల ద్వారా రైతులకు సబ్సిడీలను అందిస్తుందని, వాటిని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంను 15 రోజులపాటు పెద్దపెల్లిలోని వివిధ మండలాల్లో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, జాతీయ మాంస పరిశోధన సంస్థ నుండి వచ్చిన శాస్త్రవేత్తలు కలిసి సంయుక్తంగా గ్రామాల్లోని రైతులను వానకాలం సాగు అంశం మీద చైతన్య పరుస్తూ నూతన సాంకేతిక పరిజ్ఞానం ను రైతులకు అందజేశారు.
పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఆది రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో వానాకాలం సాగు అంశం మీద రైతులను ప్రోత్సహిస్తూ చైతన్య పరుస్తూ వ్యవసాయానికి సంబంధించిన వివిధ సాంకేతిక అంశాల మీద రైతులకు సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. వానాకాలం సాగులో వరి పంటను పండిస్తున్న రైతులకి విత్తన ఎంపిక కీలకం అని ప్రతీ ఒక రైతు స్వల్పకాలిక రకాలు మాత్రమే విత్తుకోవాలని అదే విధంగా పత్తి లో సాగు యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. దీంతోపాటు పెద్ద పల్లిలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ, అనిమల్ హస్బండ్రీ అధికారి డాక్టర్ శంకర్, పౌల్ట్రీ పరిశోధన సంస్థ, కన్నకి ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఏ శ్రీనివాస్, బాబ్జి, భాస్కర రావు, వినోద్ కుమార్, బసవ రెడ్డి, బాబ్జి, నవ్య, పెద్దపల్లి ఏడీఏ శ్రీనాథ్, ఇఫ్కో, జిల్లా అధికారి బాలాజీ , వ్యవసాయ విస్తరణ అధికారులు పద్మ, ప్రశాంత్, స్వప్న, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.