MLA Chintakunta Vijaya Ramana Rao | జూలపల్లి, ఏప్రిల్ 25 : దీర్ఘకాలికంగా ఆదాయాన్నిచ్చే పామాయిల్ తోటల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేట, నాగులపల్లి, పెద్దాపూర్, తేలుకుంట, జూలపల్లి, కోనరావుపేట గ్రామాల్లో శనివారం మక్క, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటల మార్పిడీకి శ్రీకారం చుట్టి అధిక దిగుబడులు సాధించాలని పేర్కొన్నారు.
రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు. కాగా మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దత్తు ప్రసాద్, ఏవో ప్రత్యూష, ఏఎంసీ చైర్మన్ కొమ్మ పోశాలు, సర్పంచులు పాటకుల అనూష, తొగరు శ్రీనివాస్, దండ వెంకటేశం, మెండె తిరుపతి, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దారబోయిన నరసింహం యాదవ్, నాయకులు పుల్లూరి వేణుగోపాల్ రావు, దుగ్యాల శ్యాంరావు, లోక జలపతి రెడ్డి, సిరికొండ కొమురయ్య, బండి స్వామి పాల్గొన్నారు.