మన వాటర్ వెరీ ‘ప్యూర్’
ఈ ఏడాది భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరైడ్, కాఠిన్యత గణనీయంగా తగ్గింది. ఇటీవల భూగర్భ జల శాఖ అధికారులు నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో ఈ విషయం తెలిసింది.
- తగ్గిన ఫ్లోరైడ్, కాఠిన్యం
- పెరిగిన భూగర్భ జలాలు
- అధికారుల పరిశీలనలో వెల్లడి
- ఏటా రెండుసార్లు శాంపిల్స్ సేకరణ
- ప్రయోగశాలలో పరిశీలన
- నీటి వినియోగంపై అవగాహన
ఈ ఏడాది భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరైడ్, కాఠిన్యత గణనీయంగా తగ్గింది. ఇటీవల భూగర్భ జల శాఖ అధికారులు నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో ఈ విషయం తెలిసింది. నీటిలో ఉండాల్సిన మేరకు లవణాలు ఉన్నాయని వెల్లడైంది. ఏటా వానకాలానికి ముందు, ఆ తర్వాత ఎంపిక చేసిన బావుల నుంచి నీటిని సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా మన నీరు సురక్షితమైనదిగా తేలింది.
– కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 22
కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 22: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం బోర్లపై ఆధారపడి పంటలు వేసేది. దీం తో ఎండాకాలం రాకముందే భూగర్భ జలాలు అడుగంటేది. మంచినీటిలో ప్లోరైడ్ పరిమాణం అధికంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నీటి వనరుల వినియోగానికి ప్రాధాన్యతనిచ్చింది. మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటలను పునరుద్ధరించింది. అంతేగాకుండా బృహత్తరమైన కాళేశ్వరంతో పాటు మిడ్‌మానేర్, అనంతసాగర్ లాంటి అనేక మధ్యతరహా ప్రాజెక్టులను నిర్మించింది. అలా గే ఇంటింటికీ సురక్షితమైన నీరందించేందుకు మిషన్ భగీరథ కింద ట్యాంకు లు నిర్మించింది. పల్లెలు, పట్టణాల్లో నూ తన పైప్లైన్లు ఏర్పాటు చేసింది. దీంతో ఇంటింటింటీకీ సురక్షితమైన తాగునీరు అందిస్తున్నది. అలాగే ఏటా ఆశించిన వర్షాలు పడుతుండడంతో కరీంనగర్ జిల్లాలో నీటి లభ్యత అనూహ్యంగా పెరిగింది. పాతాళగంగా ఉబికి వచ్చింది.

రిజర్వాయర్లు, కాలువల్లో నీరు పుష్కలంగా పారుతుండడంతో బోర్లపై ఆధారపడడం తగ్గింది. ప్రస్తుతం 10 నుంచి 15 ఫీట్ల లోతులోనే స్వచ్ఛమైన నీరు లభిస్తున్నది. నీటిలో సాంద్రత, లవణా ల శాతం ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఉత్తర తెలంగాణలోని 14 జిల్లాల నుంచి సేకరించిన నీటి నమూనాలపై పరిశోధనలు చేసి, నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి అం దజేస్తున్నట్లు చెబుతున్నారు. బావుల్లో నీటిని ప్రత్యక్షంగా 13, పరోక్షంగా 5 పా రామీటర్ల వరకు గుర్తిస్తున్నట్లు చెబుతున్నారు. భూగర్భంలో నీటి లభ్యత పెరగడం, తగ్గడంతో ఇలాంటి ఫలితాలు వ స్తాయని పేర్కొంటున్నారు. జిల్లాలో మె ట్ట ప్రాంతమైన వెన్కెపల్లి సైదాపూర్‌లో మాత్రమే నిర్దేశిత ప్రమాణాలకంటే 1.5 శాతం లోతులో భూగర్భ జలాలు ఉ న్నాయని తెలిసిందన్నారు.
ఏటా రెండు సార్లు నమూనాలు సేకరిస్తాం..
నీటి నాణ్యత పరీక్షల కోసం ఏటా వర్షాకాలానికి ముందు మే నెల, అనంతరం నవంబర్‌లో రెండు సార్లు నమూనాలు సేకరిస్తాం. జిల్లా వ్యాప్తంగా సుమారు 400 శాంపిల్స్ సేకరించి పరిశీలించాం. ఆయకట్టేతర ప్రాంతాలైన వెన్కేపల్లి-సైదాపూర్, గంగాధర, రామడుగు, చిగురుమామిడి మండలాల్లో మాత్రమే 1.5 ఎంజీ/లీటర్ కన్నా కొద్దిగా పెరిగింది. మిగిలిన చోట్ల ఉదజని సూచిక, విద్యుత్ వాహకత, నీటిలో కరిగి ఉన్న ఘనపదార్థాలు, కార్బొనేట్ అల్కనిటి, బైకార్బొనేట్ అల్కనిటి, క్లోరైడ్, ఫ్లోరైడ్, సల్ఫేట్, సోడియం, పొటాషియం, నైట్రేట్, కాల్షియం, మెగ్నీషియంతో పాటు నీటి కాఠిన్యత కూడా నిర్దేశించిన మేరకే ఉన్నాయి.
– సీహెచ్ శైలజాశ్రీమల్లికాదేవి, భూగర్భజలశాఖ డిప్యూటీ డెరెక్టర్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

