Anna Konidela | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలంగాణలోనూ పార్టీ విస్తరణపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్, ఇటీవల నిర్వహించిన పలు కార్యక్రమాలతో వార్తల్లో నిలిచారు. అదే సమయంలో రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ సతీమణి అనా లెజినోవా కొణిదెల మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్న ఆమె, కుటుంబానికి సంబంధించిన అందమైన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు.
తాజాగా అనా లెజినోవా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ప్రత్యేక ఫోటోలను షేర్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఓ సెల్ఫీతో పాటు, తన అత్తయ్య అంజనా దేవితో కలిసి ఉన్న ఆప్యాయమైన చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఫోటోల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపించడం అభిమానులను ఆకర్షిస్తోంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్, అనా లెజినోవా కలిసి కనిపించిన సెల్ఫీ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. సాధారణంగా వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా పబ్లిక్‌లోకి తీసుకురాని ఈ జంట, ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీ ఫోటోల ద్వారా అభిమానులకు అరుదైన క్షణాలను అందించారు.
అలాగే పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవితో అనా లెజినోవా ఎంతో ఆప్యాయంగా గడిపిన సందర్భాలను కూడా పంచుకోవండంతో అవి కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొణిదెల కుటుంబంలో ఉన్న బలమైన బంధాలను ఈ ఫోటోలు మరోసారి చాటిచెప్పాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “చాలా అందమైన కుటుంబం”, “పవన్ గారి ఫ్యామిలీ బాండింగ్ అద్భుతం”, “అంజనా దేవి గారితో అన్నా గారి అనుబంధం చూడముచ్చటగా ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాలు, సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించిన ఇలాంటి అరుదైన క్షణాలు బయటకు రావడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్‌గా మారాయి.