Sourav Ganguly: సౌరవ్ గంగూలీ భద్రత తగ్గింపు.. జెడ్ కేటగిరీ నుంచి వై కేటగిరీ
Sourav Ganguly: సౌరవ్ గంగూలీ భద్రతను తగ్గించారు. బెంగాల్ కొత్త సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. జెడ్ క్యాటగిరీ నుంచి వై కేటగిరీకి భద్రతను తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గంగూలీకి జెడ్ కేటగిరీ భద్రత అవసరం లేదని తేల్చారు.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) భద్రతను తగ్గించారు. కొత్తగా ఏర్పాటైన బెంగాల్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రానికి చెందిన భద్రతా శాఖ గూంగూలీ సెక్యూర్టీపై సమగ్ర విశ్లేషణ చేపట్టింది. అయితే జెడ్ క్యాటగిరీ నుంచి వై కేటగిరీకి భద్రతను తగ్గిస్తూ నిర్ణయించారు. గతంలో వై కేటగిరీలో ఉన్న భద్రతను 2023లో జెడ్ కేటగిరీకి మార్చిన విషయం తెలిసిందే. వై కేటగిరీ భద్రత కింద గంగూలీ వద్ద స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన ముగ్గురు పోలీసులు సెక్యూర్టీ డ్యూటీలో ఉండేవారు. దీంతో పాటు బెహలా నివాసంలో అంతే సంఖ్యలో స్థానిక పోలీసులు కూడా పహారా కాసేవారు.
అయితే జెడ్ కేటగిరీ కింద గంగూలీ భద్రతను 8 నుంచి 10 సిబ్బందికి పెంచేశారు. అయితే ఇప్పుడు ఆ భద్రతా సంఖ్యను మళ్లీ తగ్గించారు. రాష్ట్రంలో గంగూలీ ఎక్కడికి వెళ్లినా.. జెడ్ కేటగిరీలో భాగంగా అక్కడకు ఆయన భద్రత కూడా వెళ్తుండేది. అయితే ఇప్పుడు కొత్త భద్రతా సూచనల ప్రకారం.. గంగూలీకి జెడ్ కేటగిరీ భద్రత అవసరం లేదని తేల్చారు. అయినా కానీ అవసరమైన రీతిలో పోలీసుల ప్రొటెక్షన్ ఇవ్వనున్నారు.
అయితే వీఐపీ హోదా, హోం గార్డులు, పర్సనల్ సెక్యూర్టీ ఆఫీసర్ అంశంలో తగ్గింపు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీఐపీ సెక్యూర్టీ ప్రోటోకాల్‌లో భాగంగా భద్రతను సమీక్షించినట్లు అధికారులు చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

