Khushbu Sundar | కుమార్తె పెళ్లి.. సీఎం విజయ్ను ఆహ్వానించిన ఖుష్బూ సుందర్ దంపతులు
Khushbu Sundar | తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్, ఆమె భర్త, ప్రముఖ సినీ దర్శకుడు సుందర్ సి. తమ కుమార్తె అవంతిక వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు.
Khushbu Sundar | తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్, ఆమె భర్త, ప్రముఖ సినీ దర్శకుడు సుందర్ సి. తమ కుమార్తె అవంతిక వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి విజయ్ నివాసానికి వెళ్లిన ఖుష్బూ దంపతులు, తమ కుమార్తె అవంతిక, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్ ల వివాహ పత్రికను ఆయనకు అందజేసి ఆశీస్సులు కోరారు.
ఈ ప్రత్యేక కలయికకు సంబంధించిన వివరాలను, ఫోటోలను ఖుష్బూ సుందర్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ రోజు తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది అని పేర్కొన్న ఖుష్బూ.. ముఖ్యమంత్రి విజయ్ను తన ప్రియమైన సోదరుడిగా అభివర్ణించింది. విజయ్ను చూడటం ఎల్లప్పుడూ ఉంటుందని. తమ పిల్లలు కూడా విజయ్ను చూసి ఎంతో ఆనందించారని, ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఎప్పటిలాగే ఎంతో ఆప్యాయతతో, చిరునవ్వుతో తమను స్వాగతించారని ఆమె రాసుకొచ్చింది. ఈ సందర్భంగా తమకు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి, ప్రేమను, ఆశీస్సులను అందించినందుకు ముఖ్యమంత్రి విజయ్‌కు ఖుష్బూ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో సినీ రంగంలో కలిసి ప్రయాణించిన వీరిద్దరి మధ్య ఉన్న ఆత్మీయ బంధం, విజయ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ అలాగే కొనసాగడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఖుష్బూ కుటుంబం విజయ్‌తో దిగిన ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

