Flood water | మానకొండూర్ రూరల్, జులై 24 : నేషనల్ హైవే డీబీఎల్ కంపెనీ నిర్లక్ష్యంతో వరద నీరు పొయ్యేందుకు కల్వర్టులు సరిగా నిర్మించక పోవడంతో ఇండ్లల్లోకి చేరుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్గాలతో వరద నీరు మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో గురువారం వరద నీటి ఉధృతి పెరగడంతో ఇండ్లలోకి చేరి ఇంట్లో ఉన్న వస్తువులు సైతం నీటిలో తడిసి ముద్దయ్యాయి.
చెంజర్ల గ్రామ పరిధిలో నేషనల్ హైవే పనులు చేస్తోన్న కంపెనీ నిర్లక్ష్యంతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో కరెంట్ ట్రాన్స్ ఫార్మర్లు కూడా ఉన్నాయి. నీరు చేరి, ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు ఉధృతితో గడ్డి అశోక్, గడ్డి కుమార్, మద్ది కుమార్, ముత్యాల శారద, బుర్ర ఓదెలు ఇండ్లల్లోకి నీరు వరద చేరింది. వెంటనే అధికారులు, కాంట్రాక్టర్ చర్యలు చేపట్టి వరద నీరు ఇండ్లల్లోకి చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.