TLM Mela | జూలపల్లి, ఆగస్టు 13 : పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో మండల స్థాయి టీఎల్ ఎం మేళ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన అభ్యాసన సామగ్రి ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు అర్థవంతంగా బోధన అందుతుందనీ, రాష్ట్ర విద్యా వ్యవస్థలో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పీఎం షేక్ ఉపాధ్యాయులకు సూచించారు.
ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేసి విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, మండలస్థాయి మేళాలో జూలపల్లి ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల, నాగులపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, వెంకట్రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, కుమ్మరికుంటలోని ప్రాథమిక పాఠశాల, చీమల పేటలోని ప్రాథమికోన్నత పాఠశాల జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. మండల స్థాయి టీఎల్ఎం మేళాలో ఎంపికైన పాఠశాలలు ఈ నెల 20న గర్రెపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి మేళాలో పాల్గొంటాయని మండల విద్యాశాఖ అధికారి సరస్వతి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు లక్ష్మణ్ రవీందర్ ఆర్పీలు అశోక్ రాజు, సంపత్ కుమార్ త్రివేణి ఉపాధ్యాయులు సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.