Vemulavada | వేములవాడలో మహనీయుల కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు నిషేధం.. మూలమలుపులు సూచిక బోర్డుల వద్ద కూడా అమలు
వేములవాడ పట్టణంలోని మహనీయుల విగ్రహాలు, ముఖ్య కూడళ్లు, సూచిక బోర్డుల వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని పురపాలక సంఘం నిషేధం విధించింది.
- తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ఉన్న ఫ్లెక్సీలు తొలగింపు
Vemulavada | వేములవాడ, జూలై 23 : వేములవాడ పట్టణంలోని మహనీయుల విగ్రహాలు, ముఖ్య కూడళ్లు, సూచిక బోర్డుల వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని పురపాలక సంఘం నిషేధం విధించింది. అయితే వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్, కోరుట్ల బస్టాండ్, మల్లారం నంది జంక్షన్, మూలవాగు వంతెన అమరవీరుల స్థూపం, జగిత్యాల బస్టాండ్ ప్రాంతాలలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇతర వాణిజ్య వ్యాపారాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా రోజుల తరబడి ఉండిపోతున్నాయి. మహనీయుల విగ్రహాలు కనిపించకుండా పోగా రహదారులు కూడా కనిపించకుండా పెడుతున్న ఫ్లెక్సీలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
వేములవాడ పుణ్యక్షేత్ర పట్టణం కావడంతో ఇక ప్రధాన రహదారుల్లో సూచిక బోర్డులు కూడా కనిపించకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా అటు భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వేములవాడ పురపాలక సంఘం కౌన్సిల్ మహనీయుల విగ్రహాల కూడళ్లు, మూలమలుపుల వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాటిని తొలగించాలని తీర్మానించారు. ప్రమాదాల నియంత్రణతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కౌన్సిల్ సమావేశంలో తీర్మానించి అమలు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. ఇందులో భాగంగానే గురువారం తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ఉన్న ఫ్లెక్సీలను తొలగించగా పట్టణ పరిసరాల్లో ఉన్న అన్ని ఫ్లెక్సీలను కూడా తొలగిస్తామని ఆయన తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

