Burning Gunny bags | మెట్పల్లి ,ఆగస్టు 10 : మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో గల 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. చెలరేగిన మంటల్లో నిల్వచేసిన గన్నిసంచులు కాలుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మెట్పల్లి, నిర్మల్, జగిత్యాల చెందిన ఫైర్ ఇంజన్ లతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
సివిల్ సప్లై సంస్థ చెందిన తొమ్మిది లక్షల చినిగిపోయిన, కాలం చెల్లిన గన్నీ సంచులు ఉన్నట్లు గోదాం ఇన్చార్జి సురేష్ తెలిపారు. కాగా ప్రమాదవశాత్తు జరిగిందా..? లేదా..? ఆకతాయిల పనా..? ఇంకేమైనా కుట్ర దాగి ఉందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.