Fire Accident | ముకరంపుర, మే 20: ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయ పరిధిలోని ఎస్పీఎం కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతులతో పాటు స్పేర్ పార్ట్స్, ట్రాన్స్ ఫార్మర్లలో వినియోగించే ఆయిల్ డ్రమ్ములు నిల్వ ఉన్నాయి. గాలి వ్యాప్తి అధికంగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి.
ఈ ఘటనలో ఆయిల్ డ్రమ్ములను చుట్టుముట్టాయి. మంటలు, వేడిధాటికి భారీ శబ్దంతో ఆయిల్ డ్రమ్మలు ఒక్క సారిగా పేలి ఆయిల్ చిమ్మడంతో మంటల వ్యాప్తి అధికమైంది. దీంతో సమీపంలో ఉన్న ఇండ్ల వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ అధికారులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించి మంటలు ఆర్పేశారు.