KG wheels tractor | పాలకుర్తి : రోడ్లపై ట్రాక్టర్లు కేజీవీల్స్‌తో తిరిగితే చర్యలుంటాయని ఎంపీడీవో రామ్మోహనాచారి, ఎంపీవో సుదర్శన్, ఎంఏలో ప్రమోద్‌కుమార్ హెచ్చరించారు. మండలంలోని ట్రాక్టర్ యజమానులతో మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో రహదారుల పైన ట్రాక్టర్ యజమానులు కేజీ వీల్ ట్రాక్టర్లతో తిరిగినట్లైతే మొదటిసారి జరిమానా రూపాయల రూ.5వేలు, రెండోసారి రూ.10వేలు జరిమానా విధిస్తామని, మూడోసారి పట్టుబడినట్టు ట్రాక్టర్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ట్రాక్టర్ యజమానులు, రైతులు గమనించాలని పేర్కొన్నారు. రోడ్లపై కేజీవీల్స్ ట్రాక్టర్లు కనిపించిన చో ప్రజలు మండల అధికారులకు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.