Financial support | కోల్ సిటీ, ఆగస్టు 15: ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు కెనరా బ్యాంకు ఆర్థిక చేయూత అందించింది. ఈ మేరకు శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, విఠల్ నగర్, ఎలకలపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించారు. కాగా బాలికలకు ప్రోత్సాహకరంగా 5,6,7 తరగతుల కు ముగ్గురు బాలికలకు ఒక్కొక్కరికి రూ.3 వేలు, అలాగే 8, 9, 10వ తరగతి బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 వేల వేల చొప్పున కెనరా బ్యాంక్ మేనేజర్ అజిత్ పరీంచా ఉపకార వేతనాలను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.ఏడు లక్షల 50 వేలు తక్కువ వడ్డీతో స్టడీ లోన్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతీ ఏటా తమ బ్యాంకు తరపున ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోబ్యాంకు సిబ్బంది కట్టుకోజుల రఘు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జోష్ణ లత, సిబ్బంది వీ శ్రీధర్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.