Huzurabad | హుజూరాబాద్, ఫిబ్రవరి 3 : అనారోగ్యంతో బాధపడుతున్న కొత్తూరి సువర్ణ అనే మహిళకు గౌరీశెట్టి మధురమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్థిక సాయం అందజేశారు. హుజురాబాద్ మండలంలోని కనుకలగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి సువర్ణ అనే మహిళకు. మెదడులో రక్తం గడ్డకట్టి తీవ్ర అనారోగ్యానికి గురైంది. గౌరీశెట్టి మధురమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు ఆమె ఇంటికి వెళ్లి రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన కొత్తూరు జీవన్ కుమార్ అప్పు తెచ్చి మెరుగైన శస్త్ర చికిత్స చేయించినప్పటికీ తన భార్య కొత్తూరి సువర్ణ పూర్తిగా కోలుకోలేదన్నారు. కొత్తూరి సువర్ణను ఆదుకోవడానికి దాతలు సహృదయంతో ముందుకు రావాలని కోరారు. దాతలు మందుకు వచ్చి 9492300284 ఫోన్ నంబర్‌కు విరాళాలు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకుడు గౌరీశెట్టి జగదీశ్వర్, ఉప సర్పంచు శివాజీ, బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, తాళ్లపల్లి అమరేందర్, పల్లె సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.