వీణ వంక, ఏప్రిల్ 16 : మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యక్షగాన కళాకారుడు కర్రే నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకొని పలువురు దాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. ఇటీవల కర్రె నర్సయ్య మృతి చెందగా విషయం తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోనెల సమ్మయ్య మీడియా ద్వారా దాతలను సహాయం కోరారు.
దాతలు రూ.20 వేలు, 50కే జీ బియ్యం ఇవ్వగా బుధవారం మృతుడు నర్సయ్య ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోనెల సమ్మయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులు గోనెల పెద్దన్న, ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు కొలిపాక రామస్వామి, సలహాదారుడు లోకిని శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.