Financial assistance | పాలకుర్తి: పాలకుర్తి మండలం ఈశాల తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బాలసాని పద్మ(శ్రావణి) 10 రోజుల క్రితం పొలంలో నాటు వేయడానికి కూలి పనికి వెళ్లింది. కాగా అక్కడ పొలంలో ఏదో విష పురుగు కుట్టడంతో జ్వరం వచ్చింది. వెంటనే భర్త పోచం కరీంనగర్ హాస్పిటల్ తరలించగా పద్మకు అప్పటికే జ్వరం విషమించడంతో లివర్, కిడ్నీ, బ్లడ్ ఇన్ఫెక్షన్ సోకి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే హైదరాబాద్ హాస్పిటల్ యశోద హాస్పిటల్ తరలించారు. పద్మకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
భర్త పోచం లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. వీరిది పేదరికం కుటుంబం కావడంతో అప్పటికే పోచం రూ.3లక్షల వరకు అప్పు చేసి వైద్యం చేయించాడు. ఇంకా రూ.లక్షా యాబైవేలు కావాలి వైద్యులు సూచించారు. దీంతో పోచం చేసేదేమీ లేక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన ఒడ్నాల సురేష్ ను సంప్రదించాడు. దీంతో అతడు ఆమె ఆరోగ్య పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశాడు. స్పందించిన దాతలు శ్రావణి హాస్పిటల్ ఖర్చులకు రూ.81,701 సురేష్ అకౌంట్ కు పంపించారు. కాగా ఆ మొత్తాన్ని బాదితురాలిని పరామర్శించి అందజేశారు. తమకు ఆపన్న హస్తం అందించిన అందరికీ బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.