Financial assistance | చిగురుమామిడి, జూలై 20 : మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల తమ్మిశెట్టి రాములు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా ఆ కుటుంబానికి అతడి (1996-97) పదో తరగతి బ్యాచ్ చిన్ననాటి స్నేహితులు ఆదివారం రేకొండలోని రాములు ఇంటి వద్ద మృతుడు రాములు భార్య, కూతురుకు రూ.61,700 నగదు సాయం అందజేశారు. అతడితో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కన్నీటి పర్యవంతమయ్యారు.
చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి తీరనిలోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు మనో ధైర్యాన్ని కల్పించారు. వారి కుటుంబానికి అండగా నిలిచిన చిన్ననాటి స్నేహితులను గ్రామస్తులు అభినందించారు.