Gambhirpur | కథలాపూర్, మే 24 : కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన బూస గంగాధర్ అనే వ్యక్తి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా బాధిత కుటుంబానికి ఆదివారం బాల్యమిత్రులు కలిసి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు.
1999- 2000 సంవత్సరంలో అందరం కలిసి పదో తరగతి చదువుకున్నామని, మాతో కలిసి మెలిసి ఉన్న గంగాధర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని, కుటుంబ పెద్ద కోల్పోవడంతో బాధిత కుటుంబానికి ఆసరాగా ఉంటుందని బాల్య మిత్రులందరూ పొదుపు చేసి బాధిత కుటుంబానికి రూ.50 వేలు అందించినట్లు బాల్యమిత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్యమిత్రులు తదితరులు పాల్గొన్నారు.