Dubbapalli | సుల్తానాబాద్ రూరల్, ఆగస్టు13 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన గజ్జల పరుశురాములు ఇటీవల మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. దుబ్బపల్లె గ్రామానికి చెందిన కళాకారుడు గజ్జల పరుశరాములు ఇటీవల మృతి చెందాడు.
మృతుడి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ సర్పంచ్ ఉమ్మెత్తల శోభా రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ తిప్పారపు రాజయ్య, మాజీ సర్పంచ్ కలవల శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు ఉమ్మెత్తల కరుణాకర్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు పెండ్యాల రామ్ రెడ్డి, వార్డు సభ్యులు తాండ్ర అంజయ్య, మైలారం రామకృష్ణ, కలువల అనూష, శేఖర్, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. ఆయన మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయంగా 50 కేజీల బియ్యంతో పాటు నగదును అందజేశారు.