establishment of purchasing centers | సిరిసిల్ల రూరల్ , ఏప్రిల్ 9 : తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇటీవలే ‘నమస్తే తెలంగాణ’లో ‘కల్లాల వద్దనే కాంటాలు.. ధాన్యం దళారుల పాలు’ ఈ నెల 3 న కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.
దీంతో అధికారులు స్పందించి, కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామని డీఆర్డీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలంలో రెండు రోజులుగా అంకిరెడ్డిపల్లి, బస్వాపూర్, బద్దెనపల్లి, రామన్న పల్లే, వేణుగోపాల్ పూర్,గోపాల రావు పల్లే, రాళ్ళ పేట లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అదే విధంగా బుధవారం చిన్నలింగాపూర్ గ్రామంలో ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రంను ఏఎంసి చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమం లో వైస్ చైర్మన్ నరసింగం, మాజీ ఎంపిటిసి బైరినేని రాము, ఫ్యాక్స్ డైరెక్టర్ మంద నారాయణ గుర్రం భారతి సీఏ అంజలి, బాల లక్ష్మి, భారతి, హసీనా, గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం రవీందర్ రెడ్డి, బోలవేని అనిల్, పిట్ల పరశురాములు, మాసినీ, మాధవ్, హమాలీ సంఘ నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.