Godavarikhani | సొంత ఖర్చులతో రోడ్ల గుంతలు పూడ్చివేత.. రామగుండం బీఆర్ఎస్ కార్పొరేటర్‌ను అభినందించిన బల్దియా వాసులు
బతుకమ్మ పండగ వేళ... రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ లో ఆడబిడ్డలు ఆనందంగా ఆడుకునేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్ ఉదారతను చాటారు. తన సొంత ఖర్చులతో రోడ్ల గుంతలను పూడ్చి శభాష్ అనిపించుకున్నారు.
- అయినా అధికారుల్లో చలనం రాలేదని నిరసన
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 10 : బతుకమ్మ పండగ వేళ… రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ లో ఆడబిడ్డలు ఆనందంగా ఆడుకునేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్ ఉదారతను చాటారు. తన సొంత ఖర్చులతో రోడ్ల గుంతలను పూడ్చి శభాష్ అనిపించుకున్నారు. రామగుండం నగర పాలక సంస్థ అధికారులు సిగ్గు పడేలా సవాల్ విసిరారు. మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా తమ డివిజన్ లో శిథిలమైన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని వారం రోజుల క్రితం నగర పాలక కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వర్క్ ఇన్స్పెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎస్టిమేషన్ చేసి వెళ్లిపోయి మళ్లీ తిరిగి రాలేదనీ, ఈ విషయమై నగర పాలక ఈఈ, ఏఈలను అడిగితే రేపు, మాపు అంటూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
ఇక ఓపిక నశించి చేసేదేమి లేక సొంతగా సుమారు రూ.లక్ష ఖర్చులతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తెప్పించి తానే దగ్గరుండి రోడ్ల గుంతలకు మరమ్మతులు చేపించాల్సి వచ్చిందని కార్పొరేటర్ రేఖ మహేష్ తెలిపారు. ఐనప్పటికీ నగర పాలక అధికారుల్లో కనీసం చలనం రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లకు నిధులు కేటాయించిన పాలక వర్గం ఆ నిధులను ఎటు మళ్లించిందని ప్రశ్నించారు. డివిజన్ సమస్యలపై ఆరు నెలలుగా నగర పాలక కమిషనర్ కు ఫిర్యాదు చేస్తున్నా వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో లేదని వాపోయారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో రామగుండం కార్పొరేషన్ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలుస్తుందని ఎద్దేవా చేశారు. పండుగ పూట మహిళల సమస్యలను పట్టించుకోని అధికారుల తీరుపై బస్తీ మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వీడకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, కార్పొరేటర్ సమయస్పూర్తిని బస్తీ మహిళలు, స్థానికులు అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

