MLA Sunke Ravishankar | గంగాధర, ఫిబ్రవరి 15 : బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే పండుగలకు పూర్వ వైభవం వచ్చిందని, పండుగలకు పూర్వవైభావాన్ని తెచ్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గంగాధర మండలం కోట్లనరసింహులపల్లి లోని ఎరుకల నాంచారీశ్వర ఆలయంలో ఆదివారం నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు, నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచులు కరబూజ తిరుపతి గౌడ్ చిలుముల సుధాకర్, బీఆర్ఎస్ నాయకులు దూలం శంకర్ గౌడ్, రేగుల తిరుపతి, గడ్డం స్వామి, గంగాధర సంపత్, ఇరుగురాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.