Odela | ఓదెల, సెప్టెంబర్ 5 : పెద్దపల్లి కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమంలో ఓదెల మండలానికి చెందిన ప్రాథమికోన్నత పాఠశాల హరిపురం ప్రధానోపాధ్యాయులు ఏ మహేందర్ రెడ్డి, పోత్కపల్లి గర్ల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై సతీష్ ను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖాధికారిణి జీ శారద శనివారం ఘనంగా సన్మానించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం, పేరెంట్ టీచర్ సమావేశాలను నిర్వహించడం, పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం, విహారయాత్రలకు తీసుకెళ్లడం, ఎఫ్ఎల్ఎన్ స్టార్ ఛాంపియన్ గా నిలపడంలో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఓదెల మండల విద్యాధికారి రమేష్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పద్మ, శ్రీనివాస్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.