Ganneruvaram | గన్నేరువరం, ఆగస్ట్29 : మండలంలో వరిలో మొదటి దఫా యూరియా చల్లేందుకు రైతులు యూరియా బస్తాల కోసం కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారక ముందే సొసైటీ కార్యాలయాలు, డీసీఎంఎస్ వద్ద క్యూ కడుతున్నారు. మండలంలోని గుండ్లపల్లి డిసిఎంఎస్ శుక్రవారం యూరియా బస్తాలు వస్తాయని రైతులు ఉదయం నుంచే పడిగా అప్పులు కాసారు. కానీ యూరియా రాకపోవడంతో ఓపిక నశించి యూరియా రాజీవ్ రహదారి పై ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం పడి కాపులు కాస్తున్న యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సరిపడా యూరియాను ప్రభుత్వం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో కొద్దిసేపు రాజీవ్ రహదారి పై కాసేపు ట్రాఫిక్ స్తంభించింది.