CCI purchase center | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 3 : సీసీఐ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు అన్నారు. సుల్తానాబాద్ ఏఎంసీ ఆధ్వర్యంలో మండలంలోని చిన్నకాల్వల గ్రామంలోని వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లు లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని వారు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. తేమ శాతం లేకుండా పత్తిని తీసుకురావాలన్నారు. అనంతరం అన్నయ్య గౌడు, ప్రకాష్ రావుకు జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, సుల్తానాబాద్ ఏవో పైడితల్లి, కార్యదర్శి మనోహర్, నాయకులు జయపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పొన్నాల రాములు, ఏరుకొండ తిరుపతి, పన్నాల తిరుపతి, ఏరుకొండ రమేష్ , శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ సిబ్బంది, రైతులు తదితరున్నారు.