Purchasing centers | వీణవంక, అక్టోబర్ 25: రైతులు పండించిన వరిధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వీణవంక మండలంలోని గంగారం, ఎలుబాక, మామిడాలపల్లి, బొంతుపల్లి, బేతిగల్, రెడ్డిపల్లి, వల్బాపూర్, ఘన్ముక్ల, కోర్కల్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్‌చైర్మన్ గాజుల మేరీ శ్యాంసన్, డైరెక్టర్లు రాములు, శ్యాంసుందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల్, చెక్కబండి శ్రీనివాస్ రెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ సతీష్, ఎలుబాక మాజీ సర్పంచ్ ఊట్ల దేవయ్య, (సీఐటీయూ) హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పిల్లి రవియాదవ్, సీఈవో చందుపట్ల ప్రకాశ్ రెడ్డి, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.