urea | కాల్వ శ్రీరాంపూర్, ఆగస్టు 11 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూనారం సహకార సంఘానికి సోమవారం యూరియా రావడంతో రైతులు బారులు తీరారు. ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ విషయమై మండలంలో యూరియా కొరత ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.
అధికార యంత్రాంగం స్పందించి మండలంలో యూరియా కొరత లేకుండా చూడాలని పలు గ్రామాల రైతుల డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి నాగార్జునను వివరణ కోరగా సహకార సంఘానికి కేవలం 6 వందల యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయని, రేపటిలోగా మరో 450 బస్తాల యూరియా వస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.