Dharmaram | ధర్మారం, ఆగస్టు 25 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కోసం పడిగాపులు కాశారు. మేడారం సింగిల్ విండో పరిధిలోని 18 గ్రామాలకు ధర్మారం మండల కేంద్రంలో గోదాం ఉంది. దీంతో ఆదివారం సెలవు దినం కావడంతో రైతులు సోమవారం పొద్దున్నే వద్దకు వచ్చి యూరియా కోసం ఎదురుచూస్తూ అక్కడే కూర్చొని ఉన్నారు. ఈ గోదాంలో కేవలం 140 యూరియా బ్యాగులు మాత్రమే ఉండడంతో రైతులకు ఒక్కొక్కరికి యూరియా పంపిణీ చేయడం సింగిల్ విండో సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది.
ఒక్కొక్కరికి రెండు యూరియా బస్తాలు కావాలని రైతులకు డిమాండ్ చేయగా అంతా స్టాక్ లేదని ఇబ్బంది రైతులను సముదాయించారు. క్రమ పద్ధతిలో రైతుల ఆధార్, పాసుబుక్కు జిరాక్స్ ప్రతుల ప్రకారం యూరియా బస్తాలను పంపిణీ చేశారు. తమ ఉదయం నుంచి వేచి ఉన్నప్పటికీ సరిపడా యూరియా దొరకలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మండల ఇన్చార్జి వ్యవసాయ అధికారి భాస్కర్ ను వివరణ కోరగా యూరియా కోసం అధికారులకు సిఫారసు చేసామని తెలిపారు.
స్టాక్ రాగానే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. కొందరు రైతులు మొదటి దఫా యూరియా మరికొందరు రైతులు రెండో దఫా యూరియా పొలాలకు వేయడానికి సిద్ధం అవుతున్న క్రమంలో సరిపడా యూరియా అందుబాటు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
కాగా ఇప్పటికైనా సరిపడా యూరియాను అధికారులు తెప్పించి కొరత లేకుండా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియా కొరతపై మంగళవారం ధర్మారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి తెలిపారు.