పెద్దపల్లి రూరల్, జూన్ 26 : తమకు న్యాయం చేయాలని కోరుతూ పెద్దపల్లి బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులు శుక్రవారం పెద్దపల్లి శివారులోని పెద్దకల్వలలో నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొని మాట్లాడారు. రైతుల వ్యవసాయ భూముల మీదుగా బైపాస్ రహదారి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భూ రికార్డులు సర్వే హద్దులు, రహదారి కొలతలను సమగ్రంగా పరిశీలించకుండా మారింగ్ చేయడం వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సర్వే కారణంగా ఒక్కో రైతు మూడు ఎకరాల వరకు భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, మొత్తం 15 ఎకరాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు స్పందించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.