UREA | సైదాపూర్, కరీంనగర్: మండలంలోని ఆకు నూర్ లోని సైదాపూర్ ఫార్మర్స్ ప్రోడసర్స్ కంపనీ లిమిటెడ్ కు 230 బస్తాల యూరియా వచ్చింది. సోమవారం ఉదయం పలు గ్రామాల నుండి రైతులు చేరుకుని లైన్ కట్టారు. సిబ్బంది రైతుకు 2 బస్తాల చొప్పున యూరియా అందించారు. కాగా పలువురు రైతులకు యూరియా అందలేదు.
గతం లో యూరియా కొరత లేకుండా ఉండేదని, ఇప్పుడు కొరత వల్ల పనులన్నీ మానుకుని కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. కాగా ఎలాంటి కొరత లేకుండా యూరియా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.